ఈ సంక్రాంతికి ప్రదీప్ - సుధీర్ పెళ్లిళ్ల మీద పందేలు!
on Jan 6, 2026

ఇంకొన్ని రోజుల్లో సంక్రాంతి పండగ రాబోతోంది. బుల్లితెరలో సందడి మొదలయ్యింది. రకరకాల షోస్ ని పండగ సందర్భంగా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతోంది. ఇక జీ తెలుగులో సంక్రాంతి అల్లుళ్ళు పండగకు వస్తున్నారు" పేరుతో ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఒక షో ప్రసారం కాబోతోంది. దీనికి జడ్జెస్ గా ప్రదీప్-సుధీర్ ఉన్నారు. "ప్రదీప్ ని సంక్రాంతికి అల్లుడిని చేసే బాధ్యత నాది" అంటూ హీరోయిన్ రోజా చెప్పింది. "సుధీర్ ని సంక్రాంతికి అల్లుడిని చేసే బాధ్యత నాది" అంటూ శేఖర్ మాష్టర్ చెప్పాడు. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అనుకున్నారు. ఇక పెళ్లి కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ప్రదీప్ - సుధీర్ ఇద్దరూ వచ్చి "పందేలేదో కోళ్ల మీద వేసుకోవాలి కానీ మా పెళ్లిళ్ల మీద వేసుకుంటారేమిటి" అంటూ ఇద్దరూ అడిగేసారు.
ఇక ఈ ఈవెంట్ కి కూడా జీ లిటిల్ చాంప్స్ షోలో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా ఉండే లిటిల్ సింగర్ వరుణవి కూడా వచ్చేసింది. దాంతో సుధీర్ వచ్చి "పండగ ఈవెంట్ లో కూడా అడుగు పెట్టేశావా" అని అన్నాడు. వెంటనే ఆ చిన్నారి "మనం అడుగు పెట్టాకే కదా పండగ మొదలయ్యేది" అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక ఈ షోకి మాస్ మహారాజ రవితేజ, కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు బుల్లితెర మీద కనిపించేవాళ్లంతా ఈ ఈవెంట్ కి వచ్చారు. "అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలుపెట్టి" అంటూ రవితేజ గురించి ఇంట్రడక్షన్ ని సుధీర్ ఇస్తూండేసరికి "మళ్ళీ మొదలు పెట్టాడురా బాబోయ్" అంటూ రవితేజ కామెడీగా అసహనం వ్యక్తం చేశారు. ఇక నెటిజన్స్ ఐతే సుధీర్ - ప్రదీప్ కాంబో చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు. బెస్ట్ ఎంటర్టైనర్స్ అంతా కలిసి వచ్చారు. అబ్బా సూపర్ సుధీర్ ఉంటే చాలు. ఇంకా తోడుగా ప్రదీప్ రచ్చ రచ్చే..బొమ్మ అదుర్స్ కదు..టిఆర్పి పగిలిపోద్ది" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



